బ్లూంబర్గ్ వార్తాసంస్థ ప్రశ్నలకు ఆర్బీఐ స్పందన

0
16

పెద్దనోట్ల రద్దుపై తాము అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వటానికి ఆర్బీఐ నిరాకరించిందని, ఆ వివరాలను వెల్లడిస్తే దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు, రక్షణకు, ప్రజా జీవితానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని తెలిపిందని అంతర్జాతీయ వార్తాసంస్థ బ్లూంబర్గ్ వెల్లడించింది. నోట్లరద్దుపై ఆర్బీఐని డిసెంబర్ 8 జనవరి 2వ తేదీల మధ్య తాము 14 ప్రశ్నలు అడిగామని, వీటిలో కొన్నింటికి సమాధానం చెప్పలేమని, మరికొన్నింటికి వివరాలు లేవని ఆర్బీఐ చెప్పిందని బ్లూంబర్గ్ తెలిపింది. పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లుగా ప్రధాని తన నిర్ణయాన్ని ప్రకటించిన రోజున బ్యాంకుల వద్ద రద్దయిన నోట్లు ఎన్ని ఉన్నాయన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేమని ఆర్బీఐ తెలిపింది. నోట్లరద్దు నిర్ణయానికి ముందు ఆర్బీఐ ఎటువంటి కసరత్తు జరిపింది? ప్రభావంపై ఏమైనా అధ్యయనం చేశారా? అన్న ప్రశ్నలకు కూడా ఆర్బీఐ జవాబులు ఇవ్వలేదు. ఈ అంశంపై గోప్యతను పాటించటం వల్ల… నోట్లరద్దు నిర్ణయాన్ని ప్రకటించటానికి ముందు ఆర్బీఐ, కేంద్రప్రభుత్వం కసరత్తు జరిపినట్లు లేదన్న అభిప్రాయం బలపడుతుందని తన నివేదికలో బ్లూంబర్గ్ పేర్కొంది

LEAVE A REPLY