బ్రెగ్జిట్‌పై బ్రిటన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

0
14

బ్రెగ్జిట్ పై న్యాయస్థానంలో బ్రిటన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. బ్రెగ్జిట్‌కు (యూరోపియన్ యూనియన్ -ఈయూ నుంచి బ్రిటన్ విడిపోవడానికి ) ప్రధాని థెరిసా మే ప్రభుత్వం ఏకపక్ష చర్యలు తీసుకోవడం కుదరదని ఆ దేశ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయమై సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం చారిత్రాత్మక తీర్పు చెప్పింది. 11 మంది న్యాయమూర్తుల ధర్మాసనంలో 8 మంది తీర్పునకు అనుకూలత వ్యక్తం చేయగా, ముగ్గురు విభేదించారు. ఈ పరిణామంతో బ్రెగ్జిట్ ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. లిస్బన్ ఒప్పందంలోని 50వ నిబంధన మేరకు పార్లమెంటు ఆమోదం లేకుండా ప్రభుత్వం తనంత తానుగా ఈయూ నుంచి విడిపోయే ప్రక్రియను ప్రారంభించరాదని సుప్రీంకోర్టు పేర్కొన్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here