‘బ్రూస్లీ’పైనే జీవీ ఆశలు

0
15

కోలీవుడ్‌లో వరుస చిత్రాలతో దూసుకుపోతున్న యువహీరో జీవీ ప్రకాశ్‌. ఆయన సినిమా అంటేనే కుర్రకారు ఎగబడుతుంది. అంతలా ఆకట్టుకునే విధంగా గిలిగింతలు పెట్టే సన్నివేశాలు, వూర్రూతలూగించే పాటలు ఉంటాయి. ఇప్పుడు ఈ యువ హీరో జోరుకు కాస్త బ్రేక్‌ పడినట్లుంది. అసలు విషయం ఏమిటంటే.. జీవీ ప్రకాశ్‌ తన తర్వాత చిత్రం బ్రూస్లీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఆయన నటించి విడుదలైన కొన్ని చిత్రాలు అనుకున్నంతగా ఆకట్టుకోలేదు. దీంతో తన దృష్టిని బ్రూస్లీ చిత్రంపై కేంద్రీకరించారు. ఈ సినిమా చాలా రోజులుగా షూటింగ్‌ దశలోనే ఉంది. ఇది ఆలస్యం అవుతున్నప్పటికీ తనకు మంచి విజయాన్ని అందిస్తుందనే ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు జీవి. ఈ చిత్రంలో జీవీ సరసన కీర్తి కర్బందన అనే కొత్తనటి నటిస్తోంది.

LEAVE A REPLY