బ్రిస్బేన్‌ వచ్చె.. నెంబర్‌వన్‌ పోయె!

0
17

భారత ఏస్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా బ్రిస్బేన్‌ ఇంటర్నేషనల్‌ డబుల్స్‌ టైటిల్‌ దక్కించు కున్నా.. నెంబర్‌వన్‌ ర్యాంకు మాత్రం చేజార్చుకుంది. శనివారం జరిగిన మహిళల డబుల్స్‌ ఫైనల్లో టాప్‌సీడ్‌ సానియా-బెథాని మాటెక్‌ శాండ్స్‌ జోడీ 6-2, 6-3తో ఎకతరీనా మకరోవా-ఎలెనా వెస్నినా (రష్యా) ద్వయంపై నెగ్గింది. ఈ టైటిల్‌ నెగ్గినప్పటికీ.. సానియా నెంబర్‌వన్‌ ర్యాంక్‌ను కోల్పోయింది. 2015లో మీర్జా టాప్‌ ర్యాంక్‌ సాధించింది. స్విట్జర్లాండ్‌ స్టార్‌ మార్టినా హింగిస్‌తో అద్భుత విజయాలు సాధించిన సానియా 91 వారాలపాటు అగ్రస్థానంలో కొనసాగింది. అయితే ఆమె గత కొంతకాలంగా ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతుండడంతో టాప్‌ ర్యాంక్‌పై ప్రభావం చూపింది. ఇక సానియా పార్ట్‌నర్‌ బెథాని మాటెక్‌ శాండ్స్‌ (అమెరికా) టాప్‌ ర్యాంక్‌కు ఎగబాకింది. బ్రిస్బేన్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో సానియా-బెఽథాని జోడీ టైటిల్‌ సాధించింది. దీంతో మాటెక్‌ శాండ్స్‌కు అగ్రస్థానానికి అవసరమైన పాయింట్లు లభించాయి. అధికారికంగా ర్యాంకింగ్స్‌ను మాత్రం ఇంకా ప్రకటించలేదు. ‘ఇక్కడ టైటిల్‌ నిలబెట్టుకోవడం ఆనందంగా ఉంది. కానీ.. నెంబర్‌వన్‌ చేజారడంతో మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని బెథానికి అప్పగిస్తున్న భావన కలుగుతోంద’ని విజయానంతరం సానియా తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here