బ్రిటన్ పార్లమెంటుపై దాడి మాపనే-ఉగ్రవాదసంస్థ ఐఎస్ ప్రకటన

0
14

బ్రిటన్ పార్లమెంటుపై దాడి చేసింది తామేనని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది. కాలిఫేట్ సైనికుడు దాడి జరిపాడు అని ఐఎస్ తన ప్రచార సంస్థ అమాక్ వెబ్‌సైట్‌లో పేర్కొన్నది. తమపైకి సంకీర్ణ దళాలను పంపిన దేశాలపై ప్రతీకార దాడుల్లో భాగంగా ఈ చర్య చేపట్టినట్టు తెలిపింది. అయితే ఇలాంటి బూకరింపులకు బెదిరేదిలేదని బ్రిటన్ ప్రధాని థెరెసా మే స్పష్టం చేశారు. గురువారం పార్లమెంటులో మాట్లాడుతూ, టెర్రరిస్టు చర్య మన ప్రజాస్వామ్యం గొంతు నొక్కాలని చూసింది.. కానీ నేడు మనమిక్కడ మళ్లీ సమావేశమయ్యాం అన్నారు. పార్లమెంటుపై దాడికి పాల్పడిన వ్యక్తి పేరు ఖాలిద్ మసూద్ అని భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనకు సంబంధించి బ్రిటన్ పోలీసులు ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేశారు. దాడిలో ఉగ్రవాదితో సహా మొత్తం నలుగురు మరణించారని, వారిలో నలబయ్యోవడిలో ఉన్న ఓ మహిళ కూడా ఉన్నారని స్కాట్లండ్ యార్డు యాంటీ టెర్రరిజం విభాగం అధిపతి మార్క్ రౌలీ వివరించారు. పార్లమెంటు ద్వారం వద్ద ఉగ్రవాది కత్తితో దాడి జరిపినప్పుడు పీసీ కీత్ పామర్ అనే పోలీసు అధికారి మరణించారు.

LEAVE A REPLY