బ్రాడ్‌మ‌న్ స‌ర‌స‌న విరాట్‌

0
28

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చ‌రిత్ర సృష్టించాడు. ముంబై టెస్ట్‌లో డ‌బుల్ సెంచ‌రీ చేసిన విరాట్.. మూడు డ‌బుల్ సెంచ‌రీలు చేసిన టీమిండియా కెప్టెన్‌గా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మూడు డ‌బుల్‌ సెంచ‌రీలూ ఈ ఏడాదిలోనే చేయ‌డం మ‌రో విశేషం. క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఐదో బ్యాట్స్ మన్ కోహ్లి. అతని కంటే ముందు డాన్ బ్రాడ్ మన్, రికీ పాంటింగ్, మైకేల్ క్లార్క్, బ్రెండన్ మెకల్లమ్ మాత్రమే ఒక కేలండర్ ఇయర్ లో మూడు డబుల్ సెంచరీలు చేశారు.

ప్ర‌స్తుతం ప్ర‌పంచ క్రికెట్‌లో త‌న‌ను మించిన బ్యాట్స్‌మ‌న్ మ‌రొక‌రు లేర‌ని ఈ తాజా ఇన్నింగ్స్‌తో విరాట్ మ‌రోసారి నిరూపించాడు. ఈ ఏడాది మొద‌ట్లో వెస్టిండీస్‌తో తొలి డ‌బుల్ సెంచ‌రీ చేసిన విరాట్‌.. త‌ర్వాత న్యూజిలాండ్‌తో, ఇప్పుడు ఇంగ్లండ్‌తో మ‌రో రెండు డ‌బుల్ సెంచ‌రీలు త‌న ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌పై ఉన్న చెత్త రికార్డును కూడా తుడిచిపెట్టేశాడు కోహ్లి. సిరీస్ మొద‌ల‌య్యే ముందు ఇంగ్లండ్‌పై అత‌ని స‌గ‌టు 13.40 మాత్ర‌మే.

LEAVE A REPLY