బ్యాటు.. తడబాటు

0
28

పేలవ బ్యాటింగ్‌తో టీమ్‌ఇండియా చిత్తయింది. ఇంగ్లాండ్‌ బౌలర్లు సమష్టిగా రాణించిన వేళ.. గురువారం తొలి టీ20లో కోహ్లీసేన 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మొయిన్‌ అలీ (2/21)తో పాటు ఇతర ఇంగ్లాండ్‌ బౌలర్లు షాట్లకు ఏమాత్రం అవకాశం లేకుండా బౌలింగ్‌ చేయడంతో మొదట భారత్‌ 7 వికెట్లకు 147తో సరిపెట్టుకుంది. భారత బ్యాట్స్‌మెనెవరూ బౌలర్లపై ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయారు. ధోని (36 నాటౌట్‌; 27 బంతుల్లో 3×4) టాప్‌ స్కోరర్‌. రైనా (34; 23 బంతుల్లో 4×4, 1×6) కోహ్లి (29; 26 బంతుల్లో 4×4) రాణించారు. లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ 18.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. మోర్గాన్‌ (51; 38 బంతుల్లో 1×4, 4×6), రూట్‌ (46 నాటౌట్‌; 46 బంతుల్లో 4×4) చెలరేగారు. అలీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ 1-0 ఆధిక్యం సంపాదించింది. రెండో టీ20 ఆదివారం నాగ్‌పుర్‌లో జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here