బ్యాంకు లాకర్లలో పది కోట్లు!

0
20

న్యూఢిల్లీ: ఆదాయం పన్ను అధికారులు బుధవారం పుణెలోని ఓ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్‌లో తనిఖీలు జరిపి రూ.పదికోట్ల లెక్కచూపని నగదును లాకర్లలో కనుగొన్నారు. నోట్ల రద్దు అనంతరం నిధుల మార్పిడి, పన్ను ఎగవేతలకు సంబంధించిన ఘటనలపై దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహించారు. పుణెలోని పార్వతి ఏరియా బ్రాంచ్ లాకర్లలో భారీ మొత్తంలో నగదు లభించిందని అధికారులు తెలిపారు. ఇందులో పాత నోట్లు, కొత్త నోట్లు కలిసి ఉన్నాయని, వంద రూపాయల నోట్ల నుంచి 2000 నోట్ల వరకు ఉన్నాయని చెప్పారు. సదరు సంస్థ లావాదేవీల వివరాలను అందజేయడంలో సహకరించాల్సిందిగా బ్యాంకు అధికారులను ఐటీ అధికారులు కోరారు.

LEAVE A REPLY