బ్యాంకు మేనేజర్‌ పేరుతో సైబర్‌ నేరగాడి వల

0
33

హిందీలో సంభాషించాడు. మీకు ఏటీఎం కార్డు ఉంది కదా అని ప్రశ్నించారు. లేదు అని చెప్పిన వాళ్ల ఫోన్ నెంబర్లను వెంటనే కట్‌ చేశాడు. ఏటీఎం కార్డు ఉన్నదని చెప్పిన వారితో ఆ కార్డు మీద ఉన్న 16 అంకెల నెంబర్‌, వెనుక ఉన్న మూడు అంకెల సీవీవీ నెంబర్‌, పిన్ నెంబర్‌ చెప్పమని ఒత్తిడి చేశాడు. మీ అకౌంట్‌లో వేరొకరి నగదు జమ అయిందని, దానిని రివర్స్‌ చేయాలని చెప్పాడు. కొంతమందితో అయితే మీ కార్డు బ్లాక్‌ అవుతుందని, ఆ వివరాలు చెబితే తాను కార్డుని బ్లాక్‌ కాకుండా చూస్తానన్నాడు. ఇప్పటికే చాలామందికి ఏటీఎం కార్డులపై ఉన్న నెంబర్‌, సీవీవీ నెంబర్‌, పిన నెంబర్‌ వేరొకరికి చెప్పకూడదన్న విషయంపై అవగాహన కలగడంతో ఆ మోసకారి నుంచి తెలివిగా తప్పించుకొన్నారు.
బ్యాంకు ఖాతాదారుల మొబైల్‌ ఫోన్లకు వచ్చిన కాలర్‌ నెంబర్‌ని కొంతమంది ట్రూ కాలర్‌ యాప్‌లో శోధించారు. అది బీహార్‌ రాష్ట్రంలో రిజిష్టర్‌ అయినట్లుగా తేలింది. సదరు వ్యక్తి మొబైల్‌ నెంబర్‌ని ఏటీఎం బ్యాంక్‌గా సేవ్‌ చేసుకొన్నాడు. దీంతో ట్రూకాలర్‌ యాప్‌లో ఏటీఎం బ్యాంకు అనే పేరు ఫ్లాష్‌ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here