బ్యాంకు అధికారి ముసుగులో రూ.70 వేలకు టోకరా

0
24

పెద్దనోట్లను రద్దుచేసి నగదు రహిత లావాదేవీలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుంటే, గ్రామీణ ఖాతాదారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసేకొం టూ ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సిర్సన్న గ్రామానికి చెంది న వాంకాడే సురేశ్ నుంచి సైబర్ మోసగాళ్లు రూ.70 వేలు ఇలాగే కాజేశారు. సురేశ్‌కు ఆదిలాబాద్ బ్యాంకు ఆఫ్ బరోడాలో ఖాతా ఉన్నది.
వానాకాలంలో సాగుచేసిన పంటలు విక్రయించగా వచ్చిన రూ. 1.25 లక్షలు బ్యాంకులో జమచేశాడు. రెండు రోజు ల కిందట సురేశ్‌కు 8677856422 నంబర్ నుంచి అపరిచిత వ్యక్తి ఫోన్‌చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారినంటూ మాట్లాడాడు. మీ డెబిట్‌కార్డును రెన్యువల్ చేయాలని, పిన్ నంబర్ చెప్పాలని అడిగాడు. నిజమేనని నమ్మిన సురేశ్ నంబర్ చెప్పేశాడు. శుక్రవారం వరకు విడతలవారీగా రూ.70 వేలు ఖాతా నుంచి మాయమయ్యాయి. శనివారం ఉదయం బ్యాంకు అధికారినని చెప్పుకున్న వ్యక్తి మళ్లీ ఫోన్‌చేసి మీ డబ్బులు డ్రా అయినట్టు మెస్సేజ్ వచ్చిందా అని సురేశ్‌ను అడిగాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here