బ్యాంకుల్లో తెలుగు తప్పనిసరి

0
22

గ్రామీణ, సెమీఅర్బన్ ప్రాంతాల్లో ఉన్న బ్యాంకుల్లో వీటిని కచ్చితంగా అమలుచేయాలని సూచించారు. ఇప్పటివరకు బ్యాంకులకు సం బంధించి అకౌంట్ తీయడానికి, పాస్‌బుక్ ఇతర లావాదేవీలన్నీ ఇంగ్లిష్, హిందీ భాషల్లోనే జరిగాయి. విత్‌డ్రా, డిపాజిట్ ఫారాలు కూడా రెండు భాషల్లోనే అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇకపై ప్రభుత్వం గుర్తించిన ప్రాంతీయ భాషలు కూడా ఉండాలని ఆర్బీఐ పేర్కొంది. బుక్‌లెట్స్‌తోపాటు, బ్యాంకుల్లో ప్రదర్శించే సైన్‌బోర్డులు వినియోగదారులతో మాట్లాడేక్రమంలో కూడా ప్రాం తీయ భాషలను ఉపయోగించాలని సర్క్యూలర్‌లో సూచించింది. చెక్‌బుక్‌లో ఆంగ్లంతోపాటు హిందీ లో రాసినా అంగీకరించాలని ఆదేశించింది.

LEAVE A REPLY