బ్యాంకుల్లో డబ్బుల్లేవ్!

0
31

నోట్ల రద్దు నిర్ణయం వెలువడేనాటికి రాష్ట్రంలో చెలామణీలో ఉన్నట్టు చెప్తున్న సొమ్ము రూ.80-90వేల కోట్లు! నోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలోని వివిధ బ్యాంకులో జమ అయిన పెద్ద నోట్ల మొత్తం సుమారు రూ.45వేల కోట్లు! కానీ.. ఆర్బీఐ నుంచి రాష్ర్టానికి అందినది రూ.12వేల కోట్లలోపే! అంటే.. బ్యాంకుకు వంద రూపాయలు జమ అవుతుంటే.. ప్రజలకు తిరిగి వచ్చింది కేవలం పది రూపాయలే! వెరసి.. నల్లధనంపై ఎక్కుపెట్టిన బ్రహ్మాస్ర్తానికి చిన్న ప్రాణాలు విలవిల్లాడుతున్నాయి. తగినంత నగదు సరఫరా లేక.. బ్యాంకులు, ఏటీఎంలు నో క్యాష్ బోర్డులు ప్రదర్శిస్తున్నాయి. ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సైతం.. కేంద్ర నిర్ణయం మంచిదే అయినా.. నోట్ల రద్దు తర్వాత తగిన చర్యలు తీసుకోకపోవడంతో సామాన్యులు నానా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ఏటీఎంలు, బ్యాంకుల్లో తగినంత నగదు లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ పరిస్థితి చక్కబడేదెప్పుడో తాను కూడా చెప్పలేనని జైట్లీ చేతులెత్తేశారు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here