బ్యాంకర్లను ఆదేశించిన సీఎస్ ఎస్పీ సింగ్

0
29

రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల పొదుపు ఖాతాలకు ఆధార్‌ను అనుసంధానించి మొబైల్ లింక్ చే యాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బ్యాంకుల కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఆదేశాలు జారీ చేశా రు. వంద శాతం నగదు రహిత లావాదేవీలు జరిగేందుకు ఏ నెల ఏం చేస్తారో చెప్పాలని ఇటీవల కేంద్ర ఆర్థికశాఖ సెక్రటరీ తెలంగాణ రాష్ర్టాన్ని కోరినట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 4.30కోట్ల బ్యాంకు ఖాతాలు ఉండగా ఇందులో 2.22 కోట్ల అకౌంట్లకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తయ్యింది. 71శాతం ఖాతాలకు మొబైల్ లింక్ జరిగింది. మిగతా వాటికి నెలాఖరులోగా ఆధార్, మొబైల్ లింక్ చేస్తామని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రం లో 3.50 కోట్ల మంది ప్రజలు ఉంటే అందులో చాలామందికి బ్యాంకు ఖాతాలు లేవు. కొందరికి ఒకటికంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. ఇలా పరిశీలిస్తే జనాభా కంటే బ్యాంకు ఖాతాలే ఎక్కువగా ఉన్నాయి. రెండు, మూడు ఖాతాలకు ఆధార్, మొబైల్ లింక్ లేవు. ఈ చర్యలతో రెండు ఖాతాలు లెక్కలోకి వస్తాయి. ఉపాధిహామీ పథకం కూలీల 21,36,919 ఖాతాలు ఉన్నాయి. వీటిలో 93 శాతం ఆధార్ అనుసంధానం జరిగింది. పీఎంజేడీవై ఖాతాలు 88 లక్షలు ఉండగా ఇందులో 85 శాతం ఆధార్ లింక్ జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here