బౌలింగ్తోనే సమాధానం చెప్పాడు’

0
15

ఇంగ్లండ్తో మూడు ట్వంటీ 20ల సిరీస్కు వెటరన్ బౌలర్ ఆశిష్ నెహ్రాను ఎంపిక చేయడం సబబేనా అనే ప్రశ్నకు అతను బౌలింగ్తోనే సమాధానం చెప్పాడని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. ప్రత్యేకంగా నెహ్రా వేసిన తొలి స్పెల్ అద్భుతమని కొనియాడాడు. ‘నెహ్రా ఎప్పుడూ అసాధారణ బౌలరే. అతను మెరుగైన ఫీల్డర్ కానప్పటికీ, బంతితో నెహ్రా ఆకట్టుకుంటూనే ఉన్నాడు. నిన్నటి మ్యాచ్లో అతని బౌలింగ్ సూపర్. నెహ్రా తాజా బౌలింగ్ తో విమర్శకుల నోళ్లను మూయించాడు. కాన్పూర్ లో తొలి ట్వంటీ తరువాత అతని ప్రదర్శనపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.ఈ రోజు బంతితోనే నెహ్రా సమాధానం చెప్పాడు’అని గంగూలీ కొనియాడాడు. ఈ మ్యాచ్  లో నెహ్రా నాలుగు ఓవర్లలో 28 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు.

అయితే ఈ మ్యాచ్లో విజయానికి సంబంధించిన క్రెడిట్ మాత్రం జస్స్రిత్ బూమ్రాకే దక్కుతుందని గంగూలీ అన్నాడు. చివరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి ఎనిమిది పరుగులు  కావాల్సిన తరుణంలో బూమ్రా చెలరేగిపోవడంతోనే భారత్ కు విజయం దక్కిందన్నాడు. బూమ్రా తన చివరి రెండు ఓవర్లలో ఐదు పరుగులు మాత్రమే ఇవ్వడం కారణంగానే భారత్ కు గెలుపు సాధ్యమైందన్నాడు. ఇంతటి ఒత్తిడితో కూడిన మ్యాచ్ లో భారత్ చివరి వరకూ పోరాడి విజయం సాధించడం నిజంగానే చిరస్మరణీయమన్నాడు.

LEAVE A REPLY