బొగ్గు కేసును ప్రభావితం చేయలేదు

0
21

బొగ్గు కుంభకోణంతో సంబంధం ఉన్న వ్యక్తులతో తన నివాసంలో సమావేశమైన మాట వాస్తవమేనని, కానీ కేసును మూసివేసే విధంగా ప్రభావితం చేయలేదని సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా పేర్కొన్నారు. సీబీఐ మాజీ ప్రత్యేక డైరెక్టర్ ఎంఎల్ శర్మ నేతృత్వంలోని విచారణ బృందం ఆయనను ప్రశ్నించింది. ఈ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించినట్టు తెలిసింది. రంజిత్ సిన్హా సీబీఐ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఆయన అధికారిక నివాసాన్ని సందర్శించిన వారి వివరాలు ఉన్న విజిటర్స్ డైరీని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టుకు సమర్పించారు. సిన్హా నిందితులతో కుమ్మక్కయ్యారని ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. దీని ఆధారంగా అత్యున్నత న్యాయస్థానం రంజిత్ సిన్హాను విచారించాలని ఎంఎల్ శర్మ బృందాన్ని ఆదేశించింది.

LEAVE A REPLY