బెస్ట్‌ టీమ్‌తో ‘మిస్టర్‌’

0
25

‘బెస్ట్‌ టీమ్‌తో ‘మిస్టర్‌’ కోసం చాలా ఎగ్జయిటింగ్‌ జర్నీ చేశాను. కామెడీ, ఫైట్స్‌, మ్యూజిక్‌ అన్నీ కలిసిన మంచి కథతో తెరకెక్కింది’’ అని అంటున్నారు వరుణ్‌తేజ్‌. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘మిస్టర్‌’. లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్‌ నాయికలు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), ఠాగూర్‌ మధు నిర్మిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో చిత్ర దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ ‘‘తొమ్మిది నెలలుగా ఈ చిత్రంతో జర్నీ చేస్తున్నాను. ఇదో మంచి ట్రావెల్‌ ఫిల్మ్‌. ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ మెప్పిస్తుంది. ప్రేమ, కామెడీ సహా అన్నీ భావోద్వేగాలుంటాయి. మిస్టర్‌ అంటే మంచి మనసున్నవాడని అర్థం. ఈ చిత్రంతో వరుణ్‌ ఆడియన్స్ కి ఇంకా ఎక్కువగా కనెక్ట్‌ అవుతాడు. మా నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా సపోర్ట్‌ చేశారు. స్పెయిన్‌లోని 11 సిటీల్లో చిత్రీకరించాం. చిక్‌మంగళూర్‌, ఊటీ, కేరళలో కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. ఏప్రిల్‌ 14న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here