బెజవాడ నుంచి 12 కొత్త విమాన సర్వీసులు

0
7

కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయం నుంచి మార్చిలో కొత్తగా 12 విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దేశంలోనే అతిపెద్ద చౌకధరల విమాన సంస్థ ఇండిగో ఏటీఆర్‌ విమాన సేవల్లో భాగంగా మార్చి 2 నుంచి ఒకేసారి పది విమాన సర్వీసులను హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఇక్కడికి ప్రారంభించ నుంది.

ప్రాంతీయ విమాన సంస్థ ట్రూజెట్‌ ఎయిర్‌ లైన్స్‌ కేంద్ర ప్రభుత్వ ఉడాన్‌ పథకంలో భాగంగా కడప ఎయిర్‌పోర్టుకు ఇక్కడి నుంచి దాదాపు ఏడాదిన్నర తర్వాత మార్చి 1 నుంచి సర్వీసు పునఃప్రారంభించ నుంది. ప్రారంభ టికెట్‌ ధర రూ.598. ఇండిగో ప్రారంభించనున్న సర్వీసుల్లో హైదరాబాద్‌ విజయవాడ మధ్య ఆరు, మిగిలిన సర్వీసులను బెంగళూరు, చెన్నై నుంచి ఇక్కడికి సర్వీసులను నడపనున్నారు.

LEAVE A REPLY