బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగురామన్న వెల్లడి

0
30

తెలంగాణ: వెనుకబడిన తరగతుల(బీసీ)కు చెందిన విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమలు చేస్తున్న మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యా పథకం కోసం 110మందిని ఎంపిక చేసినట్టు అటవీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న తెలిపారు. మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 52శాతం ఉన్న బీసీల అభివృద్ధికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే బీసీ ఓవర్సీస్ విద్యా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.600 కోట్లు కేటాయించినట్టు ఆయన వెల్లడించారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు గాను 231 దరఖాస్తులు రాగా, 142 మంది ఇంటర్వ్యూకు హాజరు కాగా అందులో నుంచి 110 మందిని ఎంపిక చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం తరఫున రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్టు ఆయన చెప్పారు.

LEAVE A REPLY