బీసీసీఐ బుధవారం ప్రకటించిన జాతీయ జట్టు

0
47

బీసీసీఐ బుధవారం ప్రకటించిన జాతీయ జట్టు క్రికెటర్ల సెంట్ర ల్ కాంట్రాక్ట్‌లో భారత స్టార్ సురేశ్ రైనా పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇదే విషయాన్ని మాజీ క్రికెటర్లతోపాటు అభిమానులు సైతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చర్చించుకున్నారు. ఇప్పటికి 223 వన్డేల్లో 5568, 65 టీ 20లలో 1307 పరుగులు చేసిన రైనా ఇప్పటిదాకా జట్టులో మెరుపు ఫీల్డింగ్‌తో అదరగొట్టాడు. ఇంత ప్రతిభ ఉన్నా అతనికి కాంట్రాక్ట్ దక్కకపోవడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తాయి. అయితే, రైనాకు కాంట్రాక్టు దక్కకపోవడంపై ఓ ఆసక్తికర అంశాన్ని ఉత్తరప్రదేశ్ రంజీ జట్టు మాజీ కోచ్ ఒకరు వెల్లడించాడు. ఆ కోచ్ తెలిపిన వివరాల ప్రకారం.. రెండేండ్ల క్రితం పెండ్లి చేసుకున్న రైనా, అప్పటినుంచి ఆటపై గాకుండా క్రికెటేతర విషయాలపై ఎక్కువగా దృష్టి సారించాడంట. క్రికెట్‌ను పక్కనబెట్టి కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత వ్యాపారాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నాడు. రైనా ఈ మధ్య ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చాడు.

LEAVE A REPLY