బీఫ్ తిన‌డం మానేసిన ముస్లిం మ‌తపెద్ద‌!

0
15

ఓ మ‌తం మ‌నోభావాల‌ను గౌర‌విస్తూ బీఫ్ తిన‌డం మానేశారు అజ్మేర్ ష‌రీఫ్ ద‌ర్గాలోని ఓ ముస్లిం మ‌త‌పెద్ద‌. అంతేకాదు ముస్లింలు అంద‌రూ బీఫ్ తిన‌కూడ‌ద‌ని సూచించారు. స‌య్య‌ద్ జైనుల్ అబెదిన్ అలీఖాన్ అనే ఆ మ‌త‌పెద్ద‌.. ట్రిపుల్ త‌లాఖ్‌కు కూడా స్వ‌స్తి ప‌ల‌కాల‌ని, అది ఖురాన్ స్ఫూర్తికి విరుద్ధ‌మ‌ని అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఈయ‌న సాధార‌ణ వ్య‌క్తి కూడా కాదు. ప్ర‌ముఖ సూఫీ స‌న్యాసి ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ వార‌సుడిగా స‌య్య‌ద్ జైనుల్‌ను చూస్తారు. త‌న‌తోపాటు త‌న కుటుంబం జీవితంలో ఇక ఎప్పుడూ బీఫ్ తిన‌కూడ‌ద‌ని ప్ర‌తిన‌బూనామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. హిందూ సోద‌రుల మ‌నోభావాల‌ను దృష్టిలో ఉంచుకొని ముస్లింలంతా బీఫ్ తిన‌డం మానేయాల‌ని, రెండు మ‌తాల మ‌ధ్య ఉన్న స‌త్సంబంధాల‌ను కొన‌సాగించేలా చూడాల‌ని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here