బీజేపీ భయంతోనే పొత్తు

0
16

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లభిస్తుందన్న భయంతోనే ప్రతిపక్షాలు చేతులు కలిపాయని ప్రధాని నరేంద్రమోదీ ఎద్దేవాచేశారు. రాజ్యసభలో మెజారిటీ సాధించి దొంగలు, దోపిడీదారులు, అవినీతి పరుల ఆటకట్టించేందుకు కఠిన చర్యలు తీసుకుంటే వారిని ఆదుకునే వారు ఉండరన్నదే విపక్షాల భయమని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. నల్లధనం దాచుకునే వారికి మద్దతు తెలిపే వారికి గుణపాఠం నేర్పేందుకు అవసరమైన చట్టాలు తీసుకొస్తానని తేల్చి చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) – కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తును ఉదహరిస్తూ బీజేపీ ప్రభంజనంతో తన పదవి పోతుందని భయపడి యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ తన అధికారాన్ని కాపాడుకునేందుకు గడ్డిపోచతోనైనా చేతులు కలిపేందుకు వెనుకాడడం లేదన్నారు. ఆదివారం అలీగఢ్‌లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ప్రధాని మోదీ తనదైన శైలిలో చణుకులు విసురుతూ విపక్షాలపై విమర్శనాస్ర్తాలు సంధించారు.

 

LEAVE A REPLY