బీజేపీలో చేరనున్న సీబీఐ మాజీ జేడీ?

0
4

ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా.. ఇద్దరు లక్ష్మీనారాయణల్లో ఎవరిని నిర్ణయిస్తే వారే సీ ఎం అవుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలనం సృష్టించారు. శ్రీవారి దర్శనానికి తిరుపతి వచ్చిన ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సీబీఐ మా జీ జేడీ లక్ష్మీనారాయణ సీఎం అవుతారా లేక మీరవుతారా అని ప్రశ్నించగా.. కన్నా పైవిధంగా బదులిచ్చారు. నిజానికి మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇంతవరకు బీజేపీలో చేరలేదు. చేరతానని ప్రకటన కూడా చేయలేదు. కానీ ఆయన పేరు ప్రస్తావించగానే మాలో ఎవరిని నిర్ణయిస్తే వారు సీఎం అవుతారని కన్నా చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు జేడీ లక్ష్మీనారాయణ బీజేపీలో చేరతారా.. పవన్‌ పార్టీలో చేరతారా అన్న చర్చ సాగుతోంది. కన్నా మాటల నేపథ్యంలో ఆయన బీజేపీలోనే చేరతారన్న వాదనకు బలం చేకూరుతోం ది. కాగా.. రాష్ట్రంలో 2019లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కన్నా స్పష్టంచేశారు.

LEAVE A REPLY