బిడ్డ మృతదేహంతో 15 కిలోమీటర్ల నడక

0
17

ఒక పక్క కన్న కూతురు చనిపోయిందన్న బాధ! మరో పక్క కనికరం లేని ఆస్పత్రి సిబ్బంది! దిక్కుతోచలేదా అభాగ్యుడికి. చివరకు ఆ చిన్నారి మృతదేహాన్ని భుజాన వేసుకుని సొంత ఊరుకి బయల్దేరాడు. ఒకటి కాదు రెండు కాదు.. 15 కిలోమీటర్లు అలానే నడిచి వెళ్లి ఆమెకు అంత్యక్రియలు నిర్వహించాడు. హృదయాన్ని కలచివేసే ఈ ఘటన ఒడిసాలో చోటు చేసుకుంది. అంగుల్‌ జిల్లా పల్లహరా సమీప గ్రా మంలో సుమీ ధిబర్‌(5) జ్వరం బారిన పడింది. దీంతో తండ్రి గటి ధిబర్‌ ఆమెను పల్లహరా హెల్త్‌కమ్యూనిటీ సెంటర్‌లో చేర్పించగా అక్కడ కన్నుమూసింది. మృతదేహాన్ని తరలించడానికి సర్కారు కల్పించిన ఉచిత వాహన సేవలను వినియోగించుకోవాలని అనుకున్నా.. సిబ్బంది ససేమిరా అన్నారు. దీంతో ఆ చిన్నారి మృతదేహాన్ని భుజాన వేసుకుని కాలినడకనే స్వగ్రామం చేరాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌చేసింది. దీనిపై స్పందించిన కలెక్టర్‌.. బాధ్యులైన ఆస్పత్రి సిబ్బందిని సస్పెండ్‌ చేశారు.

LEAVE A REPLY