బిడ్డను మెట్లపై నుంచి విసిరేసిన తల్లి!

0
40

క్షణికావేశంలో ఓ తల్లి తన రెండేండ్ల బిడ్డను రెండో అంతస్తు నుంచి ఇంటి ముందు మెట్ల పైకి విసిరేసింది. ఆ బిడ్డ ఒకటవ అంతస్తు వరకు మెట్లపై దొర్లుకుంటూ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దృశ్యం సీసీ కెమెరాలలో రికార్డయ్యింది. ఈ ఘోరం ఆగ్నేయ ఢిల్లీలో చోటుచేసుకుంది. తన కొడుకును చంపడానికి తన భార్య సోనూగుప్తా (26) ప్రయత్నించిందని భర్త నితీశ్‌గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల, ముఖానికి తీవ్ర గాయాలైన పిల్లవాడు అన్షుకు ఎయిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారని పోలీసులు తెలిపారు. గత శనివారం ఈ ఘటన జరిగింది. మంగళవారం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తి విషయంలో భర్త, అత్తమామలతో గొడవపడిన సోనూగుప్తా గట్టిగా అరుస్తూ, నిద్రపోతున్న బిడ్డను ఎత్తుకొని ఇంటి ముందు మెట్లపై విసిరేసిన అమానవీయ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు కిందికి వెళ్లి బిడ్డను స్థానిక దవాఖానకు తరలించారు. వీరితోపాటు పెంపుడు కుక్క కూడా వెళ్లిన దృశ్యం చూపరులను కదిలించింది. అనంతరం ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె చీటికీమాటికీ కోప్పడుతుందని వారు ఆరోపించారు. సంఘటన జరిగిన రోజున ఆమె ఆస్తి విషయం లేవనెత్తి కొట్లాడిందని, తమందరినీ చంపేస్తానని బెదిరించిందని సోను అత్త అన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here