బిగ్ బాస్ హౌస్ లో ట్రిపుల్ ధమాకా..సందడి చేయనున్న రాశి ఖన్నా, నివేత థామస్, కళ్యాణ్ రామ్

0
15

ఇటీవల రిలీజ్ అవుతున్న ప్రతీ సినిమా ప్రమోషన్ కు బిగ్ బాస్ హౌస్ వేదికవుతోంది. ఇప్పటికే పలువురు హీరోలు బిగ్ బాస్ హౌస్ లో కొంత సమయం గడిపి తమ సినిమాలకు కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకున్నారు. అదే బాటలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నడవబోతున్నాడు. ఇప్పటికే ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న జూనియర్, తన సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇద్దరు హీరోయిన్లను బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతున్నాడు.

జై లవ కుశ సినిమాలోఎన్టీఆర్ కు జోడిగా నటించిన రాశీ ఖన్నా, నివేదా థామస్ లు శనివారం బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయనున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం షూటింగ్ కూడా పూర్తయ్యింది. బిగ్ బాస్ హౌస్ లో సమయం గడపటం ఎందో ఆనందంగా ఉందంటూ తన సోషల్ మీడియా పేజ్ లో ట్వీట్ చేసింది రాశీఖన్నా. జై లవ కుశ సినిమాలో ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తుండగా.. పవర్ ఫేం బాబీ దర్శకత్వం వహిస్తున్నారు.

LEAVE A REPLY