బాహుబలి-2 తరువాత మహాభారతమా…

0
28

2015లో సంచలన దర్శకుడు రాజమౌళి రెండు భాషల్లో నిర్మించిన బాహుబలి భారతీయ చలన చిత్ర రంగాన్నే ఒక వూపువూపింది. ఒక అనువాద చిత్రంగా హిందీ, మలయాళ, ఫ్రెంచ్‌, జర్మన్‌ భాషల్లో కూడా సంచలనాలు రేపింది. దీని తరువాత రాజమౌళి నిర్మించబోయే సినిమా ఏమై ఉంటుందనే చర్చ అప్పుడే మొదలైంది. అయితే రాజమౌళి తనకు మహభారత కథను ఎవరూ వూహించనంత గొప్పగా, భారీగా నిర్మించాలనే కోరిక వుందని ఎన్నోసార్లు చెప్పారు. గతంలో ఆమీర్‌ఖాన్‌ తనకు మహభారతంలో కృష్ణుడి పాత్రను పోషించాలని ఉందని, అలాగే షారుఖ్‌ఖాన్‌ కర్ణుడి పాత్రను పోషించాలని వుందని అనడం తెలిసిందే. అంతేకాదు తన సొంత సంస్ధ తరపున మహాభారత్‌ సినిమా నిర్మిస్తానని కూడా షారుక్‌ ప్రకటించాడు. షారుఖ్‌ఖాన్‌, ఆమీర్‌ఖాన్‌ గతంలో జోష్‌, రంగ్‌దే బసంతి, లండన్‌ డ్రీమ్స్‌ సినిమాలలో కలిసి నటించాల్సింది. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. అయితే రాజమౌళి మాత్రం బహుబలి-2 తరువాత వెయ్యికోట్ల బడ్జెట్‌తో గరుడ అనే సినిమా నిర్మిస్తానని, ఆ సినిమా నిర్మాణానికి మూడు సంవత్సరాల పట్టవచ్చని సూచనప్రాయంగా తెలిపాడు. ఇందులో జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించే అవకాశం లేకపోలేదు. కొద్ది రోజులు ఆగితేనే గాని రాజమౌళి ప్రణాళిక బయటకు రాదు!

LEAVE A REPLY