బాలీవుడ్ స్టార్ తో అఖిల్

0
23

హీరో అఖిల్ కొద్ది రోజులుగా మౌంటేన్ డ్యూ‍ యాడ్ తో బిజీగా ఉంటున్నాడు. మౌంటేన్ డ్యూ‍కు ఎప్పట్నుంచో అంబాసిడర్‌గా ఉన్న అఖిల్, ఆ బ్రాండ్ యాడ్ షూట్ కోసం రీసెంట్ గా మడ్ ఐలాండ్ కి వెళ్ళాడు. అక్కడ మంచి లొకేషన్ లో అఖిల్ పై కొన్ని సీన్లు తెరకెక్కించారు. ఇక సుకాసాలో అమేజింగ్ మీల్ చేశామని అక్కడి సంగతులను కూడా సోషల్ మీడియా ద్వారా చేశాడు ఈ సిసింద్రీ. తాజాగా చిత్ర యూనిట్ ముంబై చేరుకుందట. షూటింగ్ జరుగుతున్న సమయంలో బాలీవుడ్ యాక్షన్ హీరో హృతిక్ రోషన్ లొకేషన్ కి వచ్చి, అక్కడ కొద్ది సేపు టైం గడిపాడట. ఈ విషయాన్ని అఖిల్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ ఇద్దరు కలిసి దిగిన ఫోటోని రీసెంట్ గా షేర్ చేశాడు. ఈ ఫోటోని చూసి ఇటు హృతిక్ అభిమానులు, అటు అక్కినేని అభిమానులు ఆనందంగా ఫీలవుతున్నారు. హృతిక్ నటిస్తోన్న కాబిల్ చిత్రం తెలుగులో బలం టైటిల్ తో జనవరి 25న విడుదల కానుంది. ఇక అఖిల్ సినిమా విషయానికి వస్తే ఈ హీరో త్వరలోనే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. నాగార్జున నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ చిత్రం డిసెంబర్ 12న అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. డిసెంబర్ 9న అఖిల్, ప్రముఖ డిజైనర్ శ్రేయా భూపాల్ తో ఎంగేజ్ మెంట్ జరుపుకోనున్న సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here