బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ దంగల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి

0
37

బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ దంగల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాపీస్ రికార్డులను కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. విలక్షణ నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న అమీర్‌కు హాలీవుడ్‌కు వెళ్లాలనే ఆలోచన లేదట. ఇప్పటికే బాలీవుడ్ నుంచి ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే హాలీవుడ్‌లోనూ తమ సత్తా చాటుతున్న నేపథ్యంలో హాలీవుడ్ ఎంట్రీ విషయమై మీడియా అమీర్‌ను ప్రశ్నించింది.

ఈ అంశంపై అమీర్ స్పందిస్తూ తనకు హాలీవుడ్‌కెళ్లాలనే ఆలోచన లేదని చెప్పాడు. యూఎస్‌కెళ్లి అక్కడ పనిచేయాలనే ఇంట్రస్ట్ నాకు లేదు. భారతీయ సినిమాలు తీయడమే నాకు ఇష్టం. భారత ప్రజలు, ప్రేక్షకులతో నాకు 25ఏళ్ల అనుబంధం ఉంది. అన్నిటికంటే ఈ విషయానికే నేను ఎక్కువ విలువిస్తాను. ప్రియాంక, దీపికా సక్సెస్‌తో ముందుకెళుతున్నారన్న ప్రశ్నకు బదులిస్తూ ప్రపంచస్థాయిలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడం మంచి ఆలోచనే. కానీ నాకు ఆ ఇంట్రస్ట్ లేదు. కానీ అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు తీసేందుకు ప్రయత్నిస్తా. సృజనాత్మక విషయంలో ఎటువంటి హద్దులు లేవు. ఒకవేళ జపాన్ సినిమాలో నటించమని ఆఫర్ వస్తే..స్క్రిప్ట్ నచ్చితే తప్పక చేస్తానని ప్రకటించాడు అమీర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here