బాలీవుడ్‌ హీరోలతో చిరంజీవి డ్యాన్స్‌!

0
17
రాజకీయ, సినీ ప్రముఖుడు టి.సుబ్బిరామిరెడ్డి మనవుడు కేశవ్‌ వివాహం ఇటీవల ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. పలువురు టాలీవుడ్‌, బాలీవుడ్‌ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ పెళ్లి సందర్భంగా జరిగిన సంగీత్‌ కార్యక్రమం అందర్నీ అలరించింది.

ముఖ్యంగా బాలీవుడ్‌ హీరోలు అనీల్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌లతో కలిసి మెగాస్టార్‌ చిరంజీవి స్టెప్పులేశారు. వీరితో కలిసి టీఎస్సార్‌ కూడా కాలు కదిపారు. దాదాపు రెండు నిమిషాల సేపు వీరంతా కలిసి డ్యాన్స్‌ చేసి అందర్నీ అలరించారు. ముఖ్యంగా 70 ఏళ్ల వయసు దాటిన తర్వాత కూడా టీఎస్సార్‌ అంత ఎనర్జీతో డ్యాన్స్‌ చేయడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

LEAVE A REPLY