బాధాతప్త హృదయంతో.

0
26

కళ్లలోని భావాలు హృదయాంతరంగానికి అద్దం పడతాయి. కన్నీటి చెమ్మ వేల సంఘర్షణలకు సాక్షిగా నిలుస్తుంది. కనుల భాషను అర్థం చేసుకుంటే మనసులోని భావాల్ని ఇట్టే పసిగట్టవచ్చు…ఇదేదో ప్రణయకవిత్వం అనుకుంటే పొరపడినట్లే. సోగకళ్ల సోయగం సమంత ఆవిష్కరించిన కొత్త భావాలివి. సోషల్‌మీడియాలో ఎప్పుడూ హుషారుగా వుండే ఈ అమ్మడు తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. చెమ్మగిల్లిన నయనాలతో బాధాతప్త హృదయంతో కనిపిస్తున్న తన ఫొటో ఒకటి పోస్ట్ చేస్తూ దానికి భావయుక్తమైన వ్యాఖ్యానాన్ని జత చేసింది. స్త్రీ కళ్లలోని భావాల్ని చూసి ఆమె హృదయంలో ఏముందో తెలుసుకోవడమే నిజమైన అందం అంటూ క్యాప్షన్‌ను పెట్టింది. సమంతా కవితాత్మకమైన భావాల్ని ఆమె అభిమానులు ప్రశంసలతో ముంచెత్తారు. దాదాపు లక్షమంది ఆ ఫొటోను వీక్షించారు. చైతూతో సుదీర్ఘ ప్రేమాయణాన్ని సాగించిన ఈ చెన్నై సొగసరి త్వరలో అక్కినేని ఇంట కోడలుగా అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సమంత తెలుగులో రాజుగారి గది-2 చిత్రంతో పాటు సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటిస్తున్న చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది.

LEAVE A REPLY