బాక్సాఫీస్ హిస్టరీ @ దంగల్

0
57

ముంబై: బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ నటించిన దంగల్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. హర్యాన్వీ రెజ్లర్ మహవీర్ సింగ్ పోగట్ బయోపిక్ దంగల్ సూపర్‌హిట్ టాక్‌తో కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.350కోట్లు క్లబ్‌లోకి చేరిన మొదటి ఇండియన్ సినిమాగా దంగల్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా దంగల్ రూ.376.14కోట్లు వసూళ్లతో దూసుకుపోతుంది. డిసెంబర్ 23న విడుదలైన దంగల్ రూ.376.14కోట్ల కలెక్షన్లతో, హిస్టారికల్ సక్సెస్‌తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిందని
ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఈ మూవీలో అమీర్‌కు జోడీగా సాక్షి తన్వర్ నటించింది.

LEAVE A REPLY