బల్కం పేట అమ్మవారి కల్యాణ మహోత్సవాలు

0
29

కొలిచిన వారి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. బుధవారం వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ర్టాల నుంచి సైతం భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు. 17న మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 12.30 గంటల వరకు అమ్మవారి కల్యాణ మహోత్సవం ఉంటుంది. తొలిరోజు ఉదయం 5.30 గంటలకు గణపతి పూజతో ఈ వేడుకలు మొదలవుతాయి. అనంతరం రాత్రి 7 గంటలకు ఎస్‌ఆర్‌నగర్‌లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం నుంచి అమ్మవారి ఎదురుకోళ్లు నిర్వహిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here