బలుపు సినిమాతో ప్రత్యేక గీతాల్లో నటించడం మొదలుపెట్టిన రాయ్‌లక్ష్మి

0
71

బలుపు సినిమాతో ప్రత్యేక గీతాల్లో నటించడం మొదలుపెట్టిన రాయ్‌లక్ష్మి ఇటీవల తౌబతౌబా దిల్లు రూబా…అంటూ సర్దార్ గబ్బర్‌సింగ్‌తో చిందేసి రచ్చచేసిన విషయం తెలిసిందే. కొంత విరామం అనంతరం చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ఖైదీ నంబర్ 150లోనూ ఆమె తళుక్కున మెరవబోతున్నది. రత్తాలు రత్తాలు…అంటూ సాగే ఈ ప్రత్యేక గీతంలో ఐటమ్ బాంబ్‌గా మరింత హాట్‌గా కనువిందుచేయనుందట. యువ సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ఈ పాటలో రాయ్‌లక్ష్మి తన గ్లామర్‌తో మాస్‌ని మెస్మరైజ్ చేయబోతున్నదని, చిరుతో పోటీపోటీగా రాయ్‌లక్ష్మి చిందులేసిన ఈ పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. రత్తాలు గెటప్ సూపర్. నన్ను ఈ గెటప్‌లో ైస్టెలిష్‌గా ప్రజెంట్ చేసిన కెమెరామెన్‌కు, ైస్టెలిస్ట్ కొణిదెల సుస్మితకు ప్రత్యేక ధన్యవాదాలు. రత్తాలు పాట అందరిని ఆట్టుకుంటుంది అని ట్విట్టర్‌లో తెలిపింది రాయ్‌లక్ష్మి.

LEAVE A REPLY