బతుకు జట్కా బండి

0
18

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు బస్సు సౌకర్యంలేని రోజుల్లో ప్రధాన రవాణా వ్యవస్థగా ఉన్న టాంగాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ వృత్తినే నమ్ముకున్న టాంగా కార్మికులు ప్రస్తుతం పూట గడవని స్థితిలో ఉన్నారు. టాంగాలో ఎక్కి ఒక్కసారైనా ప్రయాణం చేయాలని ఆశపడే కొందరు భక్తుల వల్ల కొద్దోగొప్పో ఉపాధి పొందుతున్నారు.  గుట్టకు పెరుగుతున్న భక్తుల రద్దీతో గిరాకీ పెరుగుతుందని భావించిన టాంగా కార్మికుల ఆశలు అడియాసలవుతున్నాయి. తరతరాలుగా టాంగాలనే నమ్ముకున్న వీరు మరో పనిచేయలేక కుటుంబాలను పోషించుకోవడానికి జవసత్వాలను కూడదీసుకుని బతుకు బండి లాగుతున్నారు. విశాలమైన రోడ్లు, ఆర్టీసీ బస్సులు, ఆటోలు టాంగాల వృత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.

LEAVE A REPLY