బడ్జెట్ ప్రతిపాదనలివ్వండి

0
20

మైనారిటీ సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో జిల్లా కలెక్టర్లు అనునిత్యం పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. మైనారిటీల సంక్షేమానికి వచ్చే బడ్జెట్‌లో కేటాయించాల్సిన నిధులకు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. బుధవారం ప్రగతి భవన్‌లో మైనారిటీల సంక్షేమంపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో మైనారిటీలను ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. ఈ మేరకు అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

LEAVE A REPLY