బడికి తగ్గుతున్న బుడుతలు

0
28

రాష్ట్రంలో ప్రభు త్వ, ప్రైవేటు అన్ని రకాల పాఠశాలల్లో ఒకటవ తరగతిలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య ఏటికేడాది తగ్గుతూ వస్తున్నది. 1వ తరగతిలో 2006-07 విద్యాసంవత్సరంలో విద్యార్థుల నమోదు 111.97 శాతం కాగా… 2015-16 నాటికి అది 102.48 శాతానికి తగ్గింది. పదేండ్లలో 9.49 శాతం తగ్గుదల నమోదైంది. కుటుంబ నియంత్రణ పద్ధతుల వాడకం పెరిగి జననాల రేటు తగ్గుతున్న క్రమంలో ఆ ప్రభావం పాఠశాలల్లో విద్యార్థుల నమోదుపై కనపడుతున్నది. భవిష్యత్తులోనూ దీని ప్రభావం మరింత అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయని తాజా గణాంకాలనుబట్టి అర్థమవుతుంది. 2009-10 నుంచి 2012-13 సంవత్సరాల మధ్యకాలంలో విద్యార్థుల నమోదు ఒకింత పెరిగినా.. మొత్తంగా చూసుకుంటే తగ్గుతూనే వస్తుందన్న విషయాన్ని విద్యాశాఖ వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి (చదువుకునే వయసున్న పిల్లలు, పాఠశాలలో చేరిన పిల్లల నిష్పత్తి ఆధారంగా ఈ శాతాన్ని లెక్కిస్తారు). పదోతరగతికి వచ్చేసరికి దాదాపు 30 శాతం వరకు విద్యార్థులు మధ్యలో బడి మానేస్తున్నారని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here