బంజార ప్రేమకథ

0
13

శ్రీనివాస్, పూజ జంటగా నటిస్తున్న బంజార చిత్రం సాండ్య సరికో ఛోర. విజయ్ పైల స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకనిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ బంజార భాషలో రూపొందుతున్న అందమైన ప్రేమకథా చిత్రమిది. స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగుతుంది. కథలోని మలుపులు ఆకట్టుకుంటాయి. నవతరం మనోభావాలకు దర్పణంలా ఉంటుంది. రతన్‌నాయక్ బాణీలు వీనుల విందుగా ఉంటాయి. సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ఆడియో, సినిమాను విడుదల చేస్తాం అని తెలిపారు. శ్రావణి, రాక్‌వేణు, సాయిరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సహనిర్మాత: దినిష్‌కుమార్ సోని.

LEAVE A REPLY