ఫ్రెంచ్ ఓపెన్ మూడోరౌండ్‌కు నాదల్, జొకోవిచ్

0
20

గతేడాది చివర్లో దుండగుడి చేతిలో కత్తిపోటుకు గురై ఫ్రెంచ్ ఓపెన్‌తో మళ్లీ రాకెట్ పట్టిన చెక్ రిపబ్లిక్ టెన్నిస్ స్టార్ పెట్రా క్విటోవా పోరాటం రెండోరౌండ్‌కే పరిమితమైంది. గాయం నుంచి కోలుకొని నేరుగా ఈ గ్రాండ్‌స్లామ్‌లో అడుగుపెట్టిన క్విటోవా రెండోరౌండ్లో పరాజయంపాలైంది. బుధవారం జరిగిన సింగిల్స్ పోరులో 15వ సీడ్ క్విటోవాకు అమెరికాకు చెందిన బెతానా మాటెక్ స్టాండ్స్ షాకిచ్చింది. మాటెక్ 7-6 (7/5), 7-6 (7/5)తో క్విటోపై గెలిచి మూడోరౌండ్‌కు దూసుకెళ్లింది. ఇక డిఫెండింగ్ చాంపియన్ గార్బినె ముగురుజా రెండోరౌండ్లో తృటిలో ఓటమిని తప్పించుకుంది. ముగురుజా (స్పెయిన్) 6-7(4), 6-4, 6-2తో అనెట్ కొంటావీట్ (ఈస్తోనియా)పై మూడుసెట్లలో గెలిచి మూడోరౌండ్ చేరింది.

మిగతా స్టార్ క్రీడాకారిణుల్లో వీనస్ విలియమ్స్ (అమెరికా) 6-3, 6-1తో కురుమి నరా (జపాన్)పై, వోజ్నియాకి (డెన్మార్క్) 6-0, 6-0తో ఫ్రాన్సెస్ అబండా (కెనడా)పై గెలిచి మూడోరౌండ్లో అడుగుపెట్టారు. పురుషుల సింగిల్స్‌లో హాట్ ఫేవరెట్లు నాదల్, జొకోవిచ్‌లు రెండోరౌండ్‌ను సులువుగా దాటారు. పదో టైటిల్ వేటలోనున్న నాదల్ 6-1, 6-4, 6-3తో రాబిన్ హాస్‌పై, డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ 6-1, 6-4, 6-3తో జొవా సౌసా (పోర్చుగల్)పై, డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 7-5, 6-1, 6-3తో సిమోన్ బొలెల్లి (ఇటలీ)పై గెలిచారు. యువ ఆటగాడు రెన్‌జో ఒలివో (అర్జెంటీనా) రెండోరౌండ్లో 7-5, 6-4, 6-7 (6/8), 6-4తో లోకల్ స్టార్ సోంగాకు షాకిచ్చి సంచలనం సృష్టించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here