ఫ్రీడం 251 స్మార్ట్ ‌ఫో‌న్ సంస్థకు.. కోర్టు నోటీసులు

0
24

ఫ్రీడం 251 చీప్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మరో చిక్కులో పడింది. రింగింగ్ బెల్స్ యాజమాన్యానికి కోర్టు నోటీసులు పంపింది. ఓ ప్రైవేట్ సంస్థకు ఇచ్చిన రెండు కోట్ల చెక్కు బౌన్స్ అయ్యింది. దీంతో ఆర్యన్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ సంస్థ దీనిపై ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన కోర్టు, రింగింగ్ బెల్స్ ఎండీ మోహిత్ గోయిల్, డైరెక్టర్స్ అన్మోల్ గోయిల్, సునీల్ గోయిల్, సీఈవో ధర్నా గోయిల్, అధ్యక్షుడు అశోక్ చద్దాకు సమన్లు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది.

LEAVE A REPLY