ఫ్యామిలీతో సెల్ఫీ టైమ్…

0
15

చాలామంది తారలు సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా వుంటారు. తమ వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాలకు సంబంధించిన పలు విశేషాల్ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు. ఇందుకు భిన్నంగా కొందరు మాత్రం సోషల్‌మీడియాపై పెద్దగా ఆసక్తిని చూపరు. అందులో హీరో రవితేజ ఒకరు. సాధారణంగా వ్యక్తిగత విషయాల్ని సాంఘిక మాధ్యమాల ద్వారా పంచుకోవడానికి ఇష్టపడరాయన. తాజాగా ఆయన తన ఫ్యామిలీతో కలిసి తీసుకున్న ఓ ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. భార్య, కుమార్తె, కుమారుడితో కలిసి వున్న ఈ ఫొటోకు ఫ్యామిలీతో సెల్ఫీ టైమ్… అని క్యాప్షన్ జత చేశారు. రవితేజ ఫ్యామిలీ ఫొటోకు అభిమానుల నుంచి విశేషమైన స్పందన లభిస్తున్నది. అద్భుతమైన కుటుంబమంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పోస్ట్ చేసిన కొద్ది వ్యవధిలోనే దాదాపు రెండు లక్షల మంది ఈ ఫొటోను వీక్షించారు. అనేక మంది షేర్ చేశారు. ప్రస్తుతం రవితేజ టచ్ చేసి చూడు అనే చిత్రంలో నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here