ఫైనల్లో హరియాణా హ్యామర్స్‌

0
24

సందీప్‌ తోమర్, రజనీష్‌ విశేషంగా రాణించి కీలక విజయాలు అందించడంతో హరియాణా హ్యామర్స్‌ జట్టు ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం ఉత్కంఠభరితంగా జరిగిన సెమీఫైనల్లో హరియాణా 6–3తో జైపూర్‌ నింజాస్‌పై గెలిచింది. పంజాబ్‌ రాయల్స్, ముంబై మహారథి జట్ల మధ్య బుధవారం జరిగే రెండో సెమీస్‌ విజేతతో గురువారం జరిగే ఫైనల్లో హరియాణా తలపడుతుంది. మ్యాచ్‌ తొలి బౌట్‌ (74 కేజీలు)లో జాకబ్‌ మకరషివిలి 10–0తో సుమీత్‌ (హరియాణా)పై గెలిచాడు. మహిళల 48 కేజీల బౌట్‌లో రీతూ ఫోగట్‌ 8–0తో ఇందుపై నెగ్గి జైపూర్‌ ఆధిక్యాన్ని 2–0కి పెంచింది. అయితే హరియాణాకు చెందిన విదేశీ రెజ్లర్లు మగోమెడ్‌ (70 కేజీలు), మర్వా అమ్రి (58 కేజీలు) తమ బౌట్లలో నెగ్గి స్కోరును 2–2తో సమం చేశారు.

LEAVE A REPLY