ఫైనల్లో మనమ్మాయిలు

0
24

బ్యాంకాక్: మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో భారత జట్టు అజేయంగా దూసుకుపోతున్నది. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళల జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన మిథాలీ రాజ్ (62) అర్ధసెంచరీతో రాణించగా, స్మృతి మందన 21, వేదా కృష్ణమూర్తి 21 పరుగులు సాధించారు. లక్ష్యఛేదనలో శ్రీలంక జట్టు.. భారత బౌలింగ్ ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 69 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో ఏక్తా బిస్త్ (3/8), ప్రీతి బోస్ (3/14)లు చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఈ టోర్నీలో భారత్‌కిది వరుసగా నాలుగో విజయం. అంతకుముందు బంగ్లాదేశ్, థాయ్‌లాండ్, పాకిస్థాన్‌లను ఓడించింది.

LEAVE A REPLY