ఫుట్‌బాల్ చాంప్ నిజామాబాద్

0
26

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రాష్ట్రస్థాయి మహిళల ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో నిజామాబాద్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. మంచిర్యాలలోని స్థానిక జడ్పీ మైదానంలో శుక్రవారం ముగిసిన ఈ టోర్నీలో నిజామాబాద్ జట్టు ఫైనల్లో వరంగల్‌ను చిత్తుచేసి ట్రోఫీని అందుకుంది. మహబూబ్‌నగర్ జట్టును ఓడించి ఆదిలాబాద్ జట్టు మూడోస్థానంలో నిలిచింది. ఎమ్మెల్యే దివాకర్ రావు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్‌లు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారిణులకు పతకాలు అందజేశారు.

LEAVE A REPLY