ఫిలింసిటీలో పవన్ మూవీ క్లైమాక్స్ చిత్రీకరణ

0
16

తమిళ చిత్రం వీరమ్ కి రేమేక్ గా తెరకెక్కుతున్న కాటమరాయుడు చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. క్లైమాక్స్ సన్నివేశంలో భాగంగా కొన్ని సెంటిమెంట్ సీన్స్ ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఫ్యాక్షన్ ప్రేమ కథాంశంగా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్.. అజయ్, శివ బాలాజీ మరియు కమల్ కామరాజులకి అన్నయ్యగా నటిస్తున్నాడు. డాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి నాటికి షూటింగ్ పూర్తి చేసుకొని మార్చిలో రిలీజ్ కానుంది. అనూప్ రూబెన్స్ ఇప్పటికే చిత్రానికి సంబంధించి మంచి బాణీలను రెడీ చేసినట్టు సమాచారం. ఇక ఈ చిత్ర టీజర్ ని జనవరి 26న విడుదల చేస్తున్నట్టు యూనిట్ ప్రకటించిన చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుంది. శృతి హాసన్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here