ఫిట్‌నెస్‌ ట్రాకర్లకు కృత్రిమ మేధ

0
18

ఫిట్‌నెస్‌ ట్రాకర్ల తయారీలో భారత సార్టప్‌ కంపెనీ బోల్ట్‌ స్పోర్ట్‌ టెక్నాలజీస్‌ సరికొత్త శకానికి నాంది పలికింది. ఇప్పటి వరకు ఫిట్‌నెస్‌ ట్రాకర్లంటే కేవలం ఎన్ని కేలరీలు ఖర్చు చేశారు? ఎంత దూరం నడిచారు? వంటి అంకెల సమాహారం మాత్రమే. అయితే సమాచారాన్ని విశ్లేషించి సరైన సూచనలిచ్చేలా కృత్రిమ మేధ(ఏఐ)తో అనుసంధానమైన ఫిట్‌నెస్‌ ట్రాకర్లు, మొబైల్‌ యాప్‌లను బోల్ట్‌ రూపొందించింది. వీటిని అమెరికాలోని లాస్‌వెగా్‌సలో జరుగుతున్న ఎలకా్ట్రనిక్‌ పరికరాల ప్రదర్శన సీఈఎ్‌స-2017లో ప్రదర్శించింది. ఏఐ ఆధారిత ఫిట్‌నెస్‌ కోచ్‌, దానికి అనుసంధానమైన షూ, స్టైడ్‌ సెన్సర్‌, స్మార్ట్‌ బ్యాండ్‌లను ప్రదర్శనలో ఉంచింది. వ్యాయామం, నడక ద్వారా ఖర్చయిన కేలరీలతో పాటు తీసుకునే ఆహారం, నిద్రించే సమయం వంటి వాటినీ ఇవి నిరంతర విశ్లేషిస్తాయని కంపెనీ సీఈవో చెప్పారు. మరింత వ్యాయామం అవసరమా? ఆహారపు అలవాట్లలో, నిద్ర సమయంలో మార్పులు చేయాలా వంటివి కూడా తెలుపుతాయన్నారు.

LEAVE A REPLY