ఫలితాలకు ముందే ప్రవేశాలు.. నోటిఫికేషన్‌కు ముందే నో వేకెన్సీ బోర్డులు

0
16

తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు సీట్ల దందాకు తెరలేపాయి. అధిక క్యాపిటేషన్ ఆశతో.. జేఈఈ మెయిన్స్-2017 పరీక్ష ఫలితాలు విడుదలైన వెంటనే యాజమాన్య కోటాలో సీట్లు అమ్ముకోవడానికి పోటీపడుతున్నాయి. ఈ నెల 12న తెలంగాణ ఎంసెట్ జరుగాల్సి ఉండగా.. ప్రైవేటు ఇంజినీరింగు కళాశాలలు అంతకు ముందే ప్రవేశాలకు తెరతీయడం గమనార్హం. కన్సల్టెంట్లతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్న కొన్ని ఇంజినీరింగ్ కాలేజీలు వారితో తమ విద్యావ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. పలు కాలేజీలు నాణ్యమైన విద్య పేరిట అధిక మొత్తంలో క్యాపిటేషన్ ఫీజు వసూలు చేస్తున్నాయి.

LEAVE A REPLY