ప్లే ఆఫ్ పోరులో అనిల్ కుమార్ విజయం

0
26

ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ రెండు కాంస్య పతకాలతో మెరిసింది. గ్రీకో -రోమన్ 85 కేజీల విభాగంలో భారత రెజ్లర్ అనిల్ కుమార్ అసాధారణ పోరాటంతో ఉబ్జెకిస్థాన్‌కు చెందిన మహ్మద్ శంషుద్దినోవ్‌ను ఓడించి కాంస్య పతకాన్ని సాధించాడు. మహిళల 75 కేజీల విభాగంలో రెజ్లర్ జ్యోతి సెమీఫైనల్లో జపాన్‌కు చెందిన మసాకో ఫురిచి చేతిలో పరాజయం పాలైంది. సెమీస్ చేరడంతో జ్యోతికి కాంస్యం ఖాయమైంది. అనిల్ కుమార్ క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలైనా అతన్ని ఓడించిన ప్రత్యర్థి ఫైనల్ చేరడంతో అతనికి కాంస్యపతక పోరులో తలపడే అవకాశం లభించింది. దీంతో గురువారం జరిగిన రెండోరోజు పోటీలలో అనిల్ కుమార్ అద్భుత పట్టుతో తన సత్తా చాటాడు.

LEAVE A REPLY