ప్రేమ వివాహానికే నా ఓటు

0
21

ప్రేమ వివాహానికే నా ఓటు అంటోంది నటి కృతికర్బంద. ఈ ఢిల్లీ బ్యూటీ బ్రూస్‌లీ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం కానుంది. ఇప్పటికే హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో నటిస్తున్న కృతికర్బంద మొదట మోడలింగ్‌ రంగంలో రంగప్రవేశం చేసి ఆ తరువాత సినిమాల్లోకి దిగుమతి అయ్యింది. ఈ అమ్మడు తెలుగులో బోణి చిత్రంతో బోణీ కొట్టింది. సుమంత్‌తో రొమాన్స్ చేసిన ఆ చిత్రం కృతికి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయినా ఆ తరువాత కూడా తీన్ మార్, ఒంగోలుగిత్త తదితర చిత్రాల్లో నటించింది. అయినా పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయింది. ఇప్పుడు కోలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరిక్షించుకోనుంది.

జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు జంటగా నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పొంగల్‌ బరిలోకి దిగాలని ప్రయత్నించి, చివరి దశలో వెనక్కు తగ్గింది. కాగా ఇటీవల జరిగిన విలేకరుల సమావేశంలో నటి కృతి కర్బంద మాట్లాడుతూ తాను ఎలాంటి సినిమా నేపథ్యం లేని కుటుంబం నంచి వచ్చానని చెప్పింది. అయితే ఇప్పటికే తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో నటిస్తున్నానని తెలిపింది. అందువల్ల ఆ భాషల్లో కొంచెం మాట్లాడగలననని  అంది. కా గా ప్రస్తుతం తమిళ భాషను నేర్చుకుంటున్నట్లు చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here