ప్రియుడి ఇంటి ముందు యువతి బైఠాయింపు

0
7

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి తనను శారీరకంగా అనుభవించి ముఖం చాటేస్తున్నాడని ఆరోపిస్తూ యువతి తన ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన జవ్వాది మాధురినాగనవ్య అనే యువతి అదే గ్రామానికి చెందిన లంకదాసు శివగణేష్‌ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. తణుకులోని ఒక సెల్‌ దుకాణంలో వీరిద్దరూ పనిచేస్తుండగా వీరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడనే నెపంతో ఫిబ్రవరిలో శివగణేష్‌పై తణుకు రూరల్‌ పోలీసుస్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది.

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గణేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇటీవల బెయిల్‌పై వచ్చిన గణేష్‌ కేసు వాపసు తీసుకోకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడంటూ యువతి ఆరోపిస్తోంది. శీతలపానీయాల్లో మత్తుమందు కలిపి తనను శారీరకంగా అనుభవించాడని ఆమె ఆరోపణలు చేస్తోంది. గణేష్‌ తండ్రి బాబూరావు సైతం పెళ్లి చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు మాటతప్పారని చెబుతోంది.

LEAVE A REPLY