ప్రియాంక చోప్రాకు స్వల్ప గాయాలు

0
18

న్యూయార్క్ : బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు స్వల్ప గాయాలయ్యాయి. క్వాంటికో టీవీ సీరియల్ చిత్రీకరిస్తుండగా ప్రియాంకకు స్వల్ప గాయాలైనట్లు యూఎస్‌ఏ టుడే ప్రకటించింది. ప్రియాంక చోప్రాకు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపింది. ప్రియాంకకు విశ్రాంతి అవసరమని వైద్యులు పేర్కొన్నారు. ప్రత్యేక వైద్య బృంద పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అందించారు. ఇటీవలే జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ప్రోగ్రామ్‌లో ప్రియాంక అందరిని అలరించిన విషయం విదితమే.

LEAVE A REPLY